Google Duo ఇప్పుడు Google Meetగా పిలవబడుతుంది.
మరింత తెలుసుకోండి

అందరికీ వీడియో కాల్స్, మీటింగ్‌లు.

Google Meet అనేది సురక్షితమైన, అధిక క్వాలిటీ గల వీడియో మీటింగ్‌లు, కాల్స్ కోసం అందరికీ, ఏ పరికరంలోనైనా అందుబాటులో ఉండే ఒక సర్వీస్.

ప్రధాన ఇమేజ్

సురక్షిత విధానంలో కలుసుకోండి

మీ సమాచారాన్ని కాపాడటానికి, మీ గోప్యతను రక్షించడానికి Google ఉపయోగించే రక్షణలన్నింటినీ Meet కూడా ఉపయోగిస్తుంది. Meet వీడియో సమావేశాలు ప్రసరణ సమయంలో ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి, అలాగే మేము అనుసరించే అనేక భద్రతా ప్రమాణాలు అదనపు రక్షణ కోసం నిరంతరం అప్‌డేట్ అవుతాయి.

సురక్షిత విధానంలో కలుసుకోండి

ఎక్కడి నుండైనా కలుసుకోండి

సిబ్బంది అందరినీ Google Meetలో ఒక్కచోట చేర్చండి, ఇందులో మీరు బిజినెస్ ప్రతిపాదనల ప్రెజెంటేషన్‌లు ఇవ్వవచ్చు, పరస్పర సహకారంతో కెమిస్ట్రీ అసైన్‌మెంట్‌లు చేయవచ్చు లేదా సరదాగా ముఖాముఖి మాట్లాడుకోవచ్చు.

బిజినెస్ సంస్థలు, పాఠశాలలు, ఇతర సంస్థలు వాటి డొమైన్‌లోని 100,000 మంది దాకా వీక్షకులకు సమావేశాలను లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు.

Google Meet అంటే ఏమిటి

ఏ పరికరంలోనైనా, ఎక్కడైనా మీట్ అవ్వండి

ఏదైనా ఆధునిక వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించి గెస్ట్‌లు వారి కంప్యూటర్ నుండి చేరవచ్చు—ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ పరికరాలలో, వారు Google Meet యాప్ నుండి చేరవచ్చు. గెస్ట్‌లు Google Nest Hub Max నుండి మీటింగ్‌లు, కాల్స్‌లో కూడా చేరవచ్చు.

ఎలాంటి పరికరం ద్వారా అయినా పాల్గొనండి

నాయిస్ లేకుండా మాట్లాడుకోండి

Google Meet మీ నెట్‌వర్క్ వేగానికి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది, కనుక మీరు ఎక్కడున్నా వీడియో కాల్‌లను తప్పకుండా అధిక నాణ్యతతో అందించేలా చూస్తుంది. ఇప్పుడు AI మెరుగుదలలు మీ చుట్టుపక్కల నాయిస్‌గా ఉన్నా మీ కాల్‌లు స్పష్టంగా వినిపించేలా చేస్తాయి.

నాయిస్ లేకుండా మాట్లాడుకోండి

అందరినీ కలుసుకోండి

Google ప్రసంగ గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందించే లైవ్ క్యాప్షన్‌లతో, సమావేశాలను Google Meet మరింత సౌకర్యవంతం చేస్తుంది. మాతృ భాష కాని వారు మాట్లాడుతుంటే అర్థం కావడానికి, వినికిడి సమస్య ఉన్న వ్యక్తులకు లేదా నాయిస్ ఉండే కాఫీ షాఫ్‌ల నుండి పాల్గొంటున్నప్పుడు, లైవ్ క్యాప్షన్‌ల సహాయంతో సమావేశంలో ఏమి చెబుతున్నది అందరూ సులభంగా అర్థం చేసుకోగలరు (కేవలం ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది).

అందరినీ కలుసుకోండి
కనెక్ట్ అయ్యి ఉండండి

కనెక్ట్ అయ్యి ఉండండి

వ్యక్తులు ఆసక్తికరంగా పాల్గొనడానికి, చర్చలో లీనమవ్వడానికి సరళమైన షెడ్యూలింగ్, సులభ రికార్డింగ్, అనుకూల లేఅవుట్‌లు సహాయపడతాయి.

పాల్గొనే వారికి స్క్రీన్ షేర్ చేయడం

మీ స్క్రీన్‌ను షేర్ చేయండి

మీ మొత్తం స్క్రీన్‌ను లేదా కేవలం విండోను చూపించడం ద్వారా డాక్యుమెంట్‌లు, స్లయిడ్‌లు, స్ప్రెడ్‌షీట్‌ల ప్రెజెంటేషన్ ఇవ్వండి.

సమావేశాలు హోస్ట్ చేయండి

భారీ సమావేశాలు హోస్ట్ చేయండి

సమావేశంలో పాల్గొనడానికి 500 మంది దాకా అంతర్గత లేదా బయటి వ్యక్తులను ఆహ్వానించండి.

మీ ఫోన్ నుండి చేరండి

మీ ఫోన్ నుండి చేరండి

Google Meet యాప్‌ను ఉపయోగించి వీడియో కాల్‌లో చేరండి లేదా సమావేశ ఆహ్వానంలోని డయల్-ఇన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కేవలం ఆడియో కాల్‌లో చేరండి.

కంట్రోల్‌ను కలిగి ఉండండి

కంట్రోల్ కలిగి ఉండండి

సమావేశాలకు డిఫాల్ట్‌గా తగిన రక్షణ ఏర్పాటు ఉంటుంది. సమావేశంలో ఎవరు చేరాలన్నది యజమానుల కంట్రోల్‌లో ఉంటుంది; సమావేశ యజమాని ఆమోదించిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించగలరు.

ఈవెంట్‌లను ప్రసారం చేయండి

అంతర్గత ఈవెంట్‌లను ప్రసారం చేయండి

టౌన్ హాళ్లు, సేల్స్ సమావేశాలు లాంటి ఈవెంట్‌లను మీ డొమైన్‌లో గరిష్ఠంగా 100,000 మంది వీక్షకులకు లైవ్ స్ట్రీమ్ చేయండి.

ప్రముఖ కంపెనీలు Google Meetను విశ్వసిస్తున్నాయి

Colagte-Palmolive
GANT
BBVA లోగో
Salesforce లోగో
AIRBUS లోగో
Twitter లోగో
Whirlpool
PWC లోగో

ముఖ్య ప్రశ్నలు

Google Hangouts, Hangouts Meet, Google Meetల మధ్య తేడా ఏమిటి?

Hangouts Meet, Hangouts Chatలు ఏప్రిల్ 2020లో Google Meet, Google Chatలకు రీబ్రాండ్ చేయబడ్డాయి. మేము 2019లో మొత్తం క్లాసిక్ Hangouts యూజర్‌లను కొత్త Meet, Chat ప్రోడక్ట్‌లకు తరలిస్తున్నట్లు ప్రకటించాము. ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్‌ను అందరికీ అందించడానికి, మేము మే 2020లో Google Meetకు చెందిన చార్జీ విధించబడని వెర్షన్‌ను ప్రకటించాము.

Google Meet సురక్షితమైనదేనా?

అవును. Meet మీ డేటాకు భద్రత కల్పిస్తూ, మీ గోప్యతను రక్షించడంలో సహాయపడటానికి Google Cloud రూపకల్పన నుండి ఉన్న భద్రతా వ్యవస్థను ఉపయోగిస్తుంది. మా గోప్యత వాగ్దానాలు, దుర్వినియోగ నిరోధక ప్రమాణాలు, డేటా రక్షణ విధానాల గురించి, మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆహ్వానం పొందిన బయటి వ్యక్తులు కాల్‌లో చేరడానికి అనుమతించబడతారా?

నిస్సందేహంగా. Google Meetకు చెందిన చార్జీ విధించబడని వెర్షన్ కోసం, పాల్గొనే వ్యక్తులందరూ చేరడానికి Google ఖాతాకు సైన్ ఇన్ చేయాలి. మీరు ఆఫీస్ లేదా వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్‌తో Google ఖాతాను క్రియేట్ చేయవచ్చు.

Google Workspace కస్టమర్‌లు అయినట్లయితే, మీరు మీటింగ్‌ను క్రియేట్ చేసిన తర్వాత, ఎవరినైనా Google ఖాతా లేకపోయినా కూడా ఆహ్వానించవచ్చు. మీటింగ్‌లో పాల్గొనే వ్యక్తులందరికీ లింక్ లేదా మీటింగ్ IDని షేర్ చేయండి.

Google Meetను ఉపయోగించడానికి ఎంత చార్జీ పే చేయాలి?

Google ఖాతాను కలిగి ఉన్న ఎవరైనా 100 మంది వ్యక్తుల దాకా పాల్గొనే విధంగా వీడియో మీటింగ్‌ను క్రియేట్ చేయవచ్చు, అలాగే ఎలాంటి చార్జీ లేకుండా ఒక్కో మీటింగ్‌ను 60 నిమిషాల వరకూ ఉచితంగా నిర్వహించగలరు.

అంతర్జాతీయంగా డయల్ చేయాల్సిన నంబర్‌లు, మీటింగ్ రికార్డింగ్, లైవ్ స్ట్రీమింగ్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ లాంటి మరిన్ని అదనపు ఫీచర్‌ల కోసం ప్లాన్‌లు, ధరలను చూడండి.

Google Meet లింక్‌ల చెల్లుబాటు గడువు ముగుస్తుందా?

ప్రతి మీటింగ్ ఒక ప్రత్యేకమైన మీటింగ్ కోడ్‌ను కలిగి ఉంటుంది, ఆ మీటింగ్ కోడ్ గడువు ముగింపు సమయం అనేది మీటింగ్ ఏ Workspace ప్రోడక్ట్ నుండి క్రియేట్ చేయబడింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మరింత చదవండి.

నా పరిశ్రమలోని ప్రమాణాలకు అనుగుణంగా Google Meet ఉందా?

Google Meetతో సహా మా ప్రోడక్ట్‌లు అన్నీ క్రమం తప్పకుండా వాటి భద్రత, గోప్యత, నియమపాలన నియంత్రణల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా స్వతంత్ర ధృవీకరణ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేషన్‌లు, నియమపాలన ధృవీకరణలు లేదా ఆడిట్ రిపోర్ట్‌లు పొందుతాయి. మా అంతర్జాతీయ సర్టిఫికేషన్‌లు, ధృవీకరణల లిస్ట్‌ను ఇక్కడ కనుగొనవచ్చు.

నా సంస్థ Google Workspaceను ఉపయోగిస్తుంది. నాకు Calendarలో Google Meet ఎందుకు కనిపించడం లేదు?

IT నిర్వాహకులు Google Workspace సెట్టింగ్‌లను కంట్రోల్ చేస్తారు, ఉదా., Google Calendarలో Google Meetను డిఫాల్ట్ వీడియో సమావేశ సాధనంగా ఉంచడం, తీసివేయడం లాంటివి. మీ సంస్థలో Google Meetను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోవడానికి Google Workspace అడ్మిన్ సహాయ కేంద్రాన్ని సందర్శించండి.